Latest News:
ద‌గ్గుబాటి హితేష్ కు నో టిక్కెట్‌! | లోకేష్.. సాక్షి టీవీకి మామూలు పంచ్ ఇవ్వ‌లేదు ! | యువ నేత‌ల పోటీ ఎక్క‌డి నుంచో... | జగన్‌ను నాగార్జున కలవడం వెనుక రహస్యం బయటపడింది | మహానాయ‌కుడు సినిమా చూస్తే..నేనేంటో తెలుస్తుంది | జీవీఎల్‌...నా గురించి తెలియ‌లాంటే మోడీని అడుగు

జగన్‌ను నాగార్జున కలవడం వెనుక రహస్యం బయటపడింది

March 13, 2019

కొద్దిరోజుల కిందట ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డితో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం అయింది. ఈ పరిణామం తర్వాత ఎన్నో రకాల వార్తలు వచ్చాయి. నాగార్జున వైసీపీలో చేరుతున్నారని కొందరంటే.. కాదు కాదు.. తన సన్నిహితులకు టికెట్ ఇప్పించేందుకు జగన్‌ను కలిశారని మరికొందరు అన్నారు. దీంతో అందరిలో అయోమయం కనిపించింది. దీనిపై ఆరోజు మాట్లాడని నాగార్జున తర్వాత సోషల్ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. తాను జగన్‌ను కలవడంలో ఎలాంటి రాజకీయ కోణం లేదన్నారు. తనకు రాజకీయాల మీద ప్రత్యేక ఆసక్తి లేదని, ఇతరుల టికెట్‌ కోసం తానెందుకు జగన్‌ను కలుస్తానని నాగార్జున అన్నారు. జగన్‌ మా కుటుంబ సన్నిహితుడు. పాదయాత్ర పూర్తి చేసిన జగన్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చానని నాగార్జున స్పష్టం చేశారు. అయినా, దీనిపై నాగ్ ఏదో రాజకీయం చేస్తున్నారని అందరిలో పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా జరిగిన ఓ పరిణామంతో దీనిపై దాదాపుగా క్లారిటీ వచ్చేసింది. అంతేకాదు, జగన్‌ను నాగార్జున కలవడం వెనుక అసలు రహస్యం బయటపడినట్లైంది.

 హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్‌రెడ్డి సమక్షంలో ప్రముఖ పారిశ్రామికవేత్త, నిర్మాత పొట్లూరి వరప్రసాద్ ఆ పార్టీలో చేరారు. జగన్.. ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దీని తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను. ఈరోజు నాతో పాటు నా కుటుంబానికి అత్యంత ప్రధానమైన రోజు. ఇన్నాళ్లు పారిశ్రామిక రంగంలో ఉన్న నేను ప్రజా జీవితంలోకి ప్రవేశించాను. జగన్ నన్ను విజయవాడ ఎంపీగా పోటీ చేయాల్సిందిగా ఆదేశించారు. ఆయన ఆదేశాలను పాటిస్తా. విజయవాడ అభివృద్ధే నా ప్రధాన అజెండా. అంతేకానీ రాజకీయాలు నా ఉద్దేశ్యం కాదు. విజయవాడను ఎలా అభివృద్ధి చేయాలనే దానిపై జగన్‌కు 25 ఏళ్ల విజన్ ఉంది. నన్ను వైసీపీలో చేరేందుకు ఎవరి నుంచి ఒత్తిడి లేదు. విజయవాడ అభివృద్ధిలో పీవీపీ సంస్థలు కీలకపాత్ర పోషించాయి. సినీ రంగానికి చెందిన కార్యక్రమాల్లో హైదరాబాద్, విజయవాడకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి’’ అని చెప్పుకొచ్చారు. ఈయన నాగ్‌కు అత్యంత సన్నిహితుడు. ఈయనకు టికెట్ కోసమే నాగ్.. జగన్‌ను కలిశారని విశ్వసనీయం తెలిసింది. ఈ పరిణామంతో ఆ భేటీపై అందరికీ క్లారిటీ వచ్చేసింది. దీనికితోడు, పీవీపీ కూడా తన చేరికకు ఎవరూ సహకరించలేదని, వైసీపీలో చేరేందుకు ఎవరి నుంచి ఒత్తిడి లేదని అనడమూ దీనికి బలం చేకూరుస్తోంది.