Latest News:
ద‌గ్గుబాటి హితేష్ కు నో టిక్కెట్‌! | లోకేష్.. సాక్షి టీవీకి మామూలు పంచ్ ఇవ్వ‌లేదు ! | యువ నేత‌ల పోటీ ఎక్క‌డి నుంచో... | జగన్‌ను నాగార్జున కలవడం వెనుక రహస్యం బయటపడింది | మహానాయ‌కుడు సినిమా చూస్తే..నేనేంటో తెలుస్తుంది | జీవీఎల్‌...నా గురించి తెలియ‌లాంటే మోడీని అడుగు

ద‌గ్గుబాటి హితేష్ కు నో టిక్కెట్‌!

March 13, 2019

-: CLEANED :-

ఎమ్మెల్యే కావాల‌నే ఆశ‌తో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ద‌గ్గుబాటి హితేష్ చెంచురాం క‌ల నెరవేర‌డం లేదు. ఆయ‌న‌ను పోటీ చేయొద్ద‌ని జ‌గ‌న్గ‌ల్చేశారు. దీంతో హితేష్ తండ్రి ద‌గ్గుబాటి వెంకటేశ్వ‌ర‌రావే ప్రకాశం జిల్లా పర్చూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా నిల‌బ‌డ‌నున్నారు. అమెరికా పౌర‌స‌త్వ‌పు స‌మ‌స్యే దీనికి కార‌ణంగా తెలుస్తోంది.

పార్టీలో చేరిన నాటి నుంచి హితేష్ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్నారు. ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అమెరికా పౌరసత్వం ర‌ద్దుకు ప్ర‌య‌త్నించారు. ఆయన అమెరికా పౌరసత్వం రద్దుకు ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించినా అది పూర్తి కాలేదు. దీంతో హితేష్ ఆశ‌లు నెర‌వేర‌డం లేదు. 

అయితే, ప‌ర్చూరు ప్ర‌స్తుత ఎమ్మెల్యే ఏలూరి సాంబ‌శివ‌రావు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావుకు గ‌ట్టి పోటీ ఇవ్వ‌నున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఏలూరి సాంబశివరావు నాలుగున్నర ఏళ్లలో నియోజకవర్గ అభివృద్ధిలో పేరు తెచ్చుకున్నారు. 1500 కోట్ల అభివృద్ధి ప‌నులు నియోజకవర్గంలో ఈ నాలుగేళ్ల‌లో జరిగాయి. మూతపడిన, శిథిలమైన 25 ఎత్తిపోతల పథకాలను పున‌రుద్ద‌రించ‌డం, పెండింగ్‌లో ఉన్న మూడు బ్రిడ్జిలను పూర్తి చేయ‌డం,  కాల్వల ఆధునికీకరణను మొండిప‌ట్టుతో చేయించ‌డం ఆయ‌న‌కు ప్ర‌జ‌ల్లో పేరు తెచ్చిపెట్టింది. ఏలూరి దూకుడు అత‌నికి యువ‌త‌లో క్రేజును పెంచింది. ఇవ‌న్నీ చూస్తుంటే.. ద‌గ్గుబాటి పోటీ చేసినా గెల‌వ‌డం ఆషామాషీ కాద‌నే అనిపిస్తుంది.

-: CLEANED :-

RELATED ARTICLES

  • No related artciles found