Latest News:
ద‌గ్గుబాటి హితేష్ కు నో టిక్కెట్‌! | లోకేష్.. సాక్షి టీవీకి మామూలు పంచ్ ఇవ్వ‌లేదు ! | యువ నేత‌ల పోటీ ఎక్క‌డి నుంచో... | జగన్‌ను నాగార్జున కలవడం వెనుక రహస్యం బయటపడింది | మహానాయ‌కుడు సినిమా చూస్తే..నేనేంటో తెలుస్తుంది | జీవీఎల్‌...నా గురించి తెలియ‌లాంటే మోడీని అడుగు

లోకేష్.. సాక్షి టీవీకి మామూలు పంచ్ ఇవ్వ‌లేదు !

March 13, 2019

సాధార‌ణంగా నారా లోకేష్ ట్విట్ట‌రులో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై అధికంగా స్పందిస్తూ రాజ‌కీయాలు త‌క్కువ‌గా మాట్లాడేవారు లోకేష్‌. కానీ ఎన్నిక‌ల ద‌గ్గ‌ర‌ప‌డిన కొద్దీ రాజ‌కీయాల‌పై బాగా దృష్టి సారించారు. ముఖ్యంగా ఈ మ‌ధ్య లోకేష్ వేస్తున్న పంచ్‌లు మామూలుగా పేల‌లేదు. జ‌గ‌న్ ఇంటిపై లోకేష్ వేసిన పంచ్ అయితే కేక పుట్టించింది. జ‌గ‌న్ ఇంటిని అంద‌రూ లోట‌స్ పాండ్ అని పిలుస్తుంటారు. లోట‌స్ అంటే క‌లువ , పాండ్ అంటే కుంట‌.... లోట‌స్‌పాండ్ జ‌గ‌న్ అంటే... క‌లువ కుంట జ‌గ‌న్‌. అందుకే  ఆయ‌న కేసీఆర్‌తో అంత ఆత్మీయంగా ఉండేది అంటూ అద్భుత‌మైన సెటైర్‌ను వైర‌ల్ చేశారు.  

తాజాగా గంటా సీటును లోకేష్ లాక్కుంటున్నారు. గంటా అలిగారు అంటూ సాక్షి మీడియా ఊద‌ర‌గొడుతోంది. దీనికి ఎవ‌రూ ఊహించ‌ని రీతిలో స‌మాధానం ఇచ్చారు లోకేష్‌. త‌న సీటు లాక్కున్నాడంటూ గంటా అల‌క అంటూ సాక్షి టీవీలో వ‌స్తున్న‌పుడు గంటా శ్రీ‌నివాస‌రావు, నారా లోకేష్ ఇద్ద‌రూ క‌లిసి సెల్ఫీ దిగారు. దానిని లోకేష్ త‌న ట్విట్ట‌రు పోస్టు చేస్తూ... అవును గంటా గారు అలిగారు. మీరే చూడండి అంటూ వ్యాఖ్యానించారు. ఇది ఇపుడు వైర‌ల్ అవుతోంది. సాక్షి మీడియాకు ఇటీవ‌ల త‌గిలిన భారీ పంచ్ ఇది. 

 

RELATED ARTICLES

  • No related artciles found