Latest News:
ద‌గ్గుబాటి హితేష్ కు నో టిక్కెట్‌! | లోకేష్.. సాక్షి టీవీకి మామూలు పంచ్ ఇవ్వ‌లేదు ! | యువ నేత‌ల పోటీ ఎక్క‌డి నుంచో... | జగన్‌ను నాగార్జున కలవడం వెనుక రహస్యం బయటపడింది | మహానాయ‌కుడు సినిమా చూస్తే..నేనేంటో తెలుస్తుంది | జీవీఎల్‌...నా గురించి తెలియ‌లాంటే మోడీని అడుగు

యువ నేత‌ల పోటీ ఎక్క‌డి నుంచో...

March 13, 2019

ఏపీ ఎన్నిక‌ల్లో ఈ సారి అనేక విశేషాలు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా టీడీపీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబునాయుడు కుమారుడు మాజీ మంత్రి నారా లోకేష్‌తో పాటు జ‌న‌సేన పార్టీ అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మ‌రికొంత మంది అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మెర‌వ‌నున్నారు. ఎవ‌రు ఎక్క‌డి నుంచి పోటీ చేస్తారు అనే దాని ఆస‌క్తి నెల‌కొంది. చంద్రబాబు వారసుడిగా రాజ‌కీయాల్లోకి అడుగుపెట్టిన నారా లోకేష్ ఇప్పటివ‌ర‌కు ప్రత్యక్ష ఎన్నిక‌ల్లో పోటీ చేసిన అనుభ‌వం లేదు. ఆయ‌న పూర్తిస్థాయి రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాక జ‌రుగుతున్న ఎన్నిక‌లు ఇవే కావ‌డంతో, ఇప్పుడు ఆయ‌న పోటీపై స‌ర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రత్యక్ష ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కుండానే లోకేష్ మంత్రి అయ్యారు. 2017లో జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌లో గెలిచి మంత్రి ప‌ద‌వి చేప‌ట్టారు. తొలుత అమ‌రావ‌తి ప్రాంతంలోని ఒక నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తార‌ని ప్రచారం జ‌రిగినా.. త‌ర్వాత ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాల‌ని నిర్ణయించుకున్నారు. చంద్రబాబు రాయ‌ల‌సీమ నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తుండ‌టంతో లోకేష్ ఉత్తరాంధ్ర నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయం మేర‌కు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ప్రస్తుతం మంత్రి గంటా శ్రీ‌నివాస‌రావు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న భీమిలి నుంచి పోటీ చేయాల‌న్న ఆలోచ‌న తెర‌పైకి వ‌చ్చింది.  మ‌రో వైపు లోకేస్ విశాఖ ఉత్త‌రం నుంచి పోటీ చేసే అవ‌కాశాలు లేక‌పోలేద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.   ఒక‌వేళ  సీబీఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ టీడీపీలోకి చేరితే ఆయ‌న‌కు భీమిలి సీటు ఇచ్చి లోకేష్‌ను విశాఖ ఉత్త‌రంకు పంపించేందుకు బాబు స‌మాలోచ‌న చేస్తున్నార‌ట‌.  ఇక జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌కల్యాణ్ కూడా ఉత్తరాంధ్రపైనే దృష్టి పెట్టారు. పార్టీకి అక్కడే ఎక్కువ‌గా ప‌ట్టుంద‌న్న భావ‌న‌లో ఆయ‌న ఉన్నారు. మొద‌ట్నుంచి ఉత్తరాంధ్ర, తూర్పు, ప‌శ్చిమ గోదావరి జిల్లాల‌పై ప‌వ‌న్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఎక్కువ సీట్లు అక్కడే సాధించాల‌న్న తాప‌త్రయంతో ఉన్నారు. ఒకే సామాజికవ‌ర్గానికి చెందిన ఓట‌ర్లు ఆయా జిల్లాల్లో ఎక్కువ‌గా ఉండ‌టం కూడా ఇందుకు కార‌ణంగా క‌నిపిస్తోంది. ప‌వ‌న్ తొలుత చెప్పిన‌ట్లు తూర్పుగోదావ‌రి జిల్లా పిఠాపురం నుంచి పోటీ చేస్తార‌ని అందరూ భావించారు. తాజాగా ఆయ‌న గాజువాక నుంచి కూడా పోటీ చేసే ఆలోచ‌న‌లో ఉన్నారు. ఈ రెండు స్థానాల్లో ఎక్కడా పోటీ చేసినా, సానుకూల ఫ‌లితాలే వ‌స్తాయ‌ని పార్టీ అంత‌ర్గత స‌ర్వేలో తేలింది. గాజువాక లేదా పిఠాపురం.. ఏ స్థానంలో బ‌రిలోకి దిగాల‌న్న దానిపై ప‌వ‌న్ త‌ర్జన‌భ‌ర్జన ప‌డుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై మ‌రో రెండు, మూడు రోజుల్లో స్పష్టత వ‌చ్చే అవ‌కాశం ఉంది. మొత్తానికి ఏపి కి చెందిన ఇద్ద‌రు కీల‌క నేత‌లు ఉత్త‌రాంద్ర పై క‌న్నేయండంతో రాజ‌కీయ వ‌ర్గాల్లో ఒక్క‌సారిగా ఆస‌క్తి నెల‌కొంది.