Latest News:
ద‌గ్గుబాటి హితేష్ కు నో టిక్కెట్‌! | లోకేష్.. సాక్షి టీవీకి మామూలు పంచ్ ఇవ్వ‌లేదు ! | యువ నేత‌ల పోటీ ఎక్క‌డి నుంచో... | జగన్‌ను నాగార్జున కలవడం వెనుక రహస్యం బయటపడింది | మహానాయ‌కుడు సినిమా చూస్తే..నేనేంటో తెలుస్తుంది | జీవీఎల్‌...నా గురించి తెలియ‌లాంటే మోడీని అడుగు

పాల్ పార్టీ సింబల్ చూస్తేనే మీకు ఓటు వెయ్యాలనిపిస్తుందా ?

February 22, 2019

ఎన్నికల సంఘం చేసే కొన్ని పనులు బలమైన రాజకీయపార్టీలకు తీవ్రనష్టాన్ని కలిగిస్తాయి. ఇందుకు చాలా వృత్తాంతాలు నిదర్శనంగా నిలిచాయి. తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కారు గుర్తును పోలిన ట్రక్కు గుర్తు ఓ సాధారణ పార్టీకి కేటాయించడంతో చాలా చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు ఓటమి అంచుకు చేరి బొటాబొటీ ఓట్లతో గట్టెక్కారు. ఇప్పుడు ఇదే పరిస్థితి ఏపీ ఎన్నికల్లోనూ పునరావృతం కానుందని వైసీపీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. తమ పార్టీ గుర్తు ఫ్యాన్ ను పోలి ఉండే హెలీకాప్టర్ గుర్తును ప్రజాశాంతి పార్టీకి కేటాయించడంతో వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే వైసీపీ – ప్రజాశాంతి పార్టీ జెండాలు సైతం ఒకే రంగులో ఉండటం ఆ పార్టీ నేతలకు మింగుడు పడటం లేదు. మళ్లీ ఈ పార్టీ గుర్తులు తమనెక్కడ ఇబ్బందులకు గురిచేస్తాయనే ఆందోళన వైసీపీ నేతల్లో మొదలైంది. కేఎ పాల్ ప్రజాశాంతి పార్టీ గుర్తు హెలికాప్ట‌ర్ లో ఎక్కువ‌గా క‌నిపించేది పైన తిరిగే రెక్క‌లే. ఇప్పుడు అవే ఫ్యాన్ రెక్క‌లు.. జ‌గ‌న్ వ‌ర్గాన్ని గుబులు పుట్టిస్తున్నాయి.

వైసీపీ ఎన్నిక‌ల గుర్తు ఫ్యాన్‌. ప్ర‌జాశాంతి పార్టీది హెలికాప్ట‌ర్‌. అక్ష‌రాస్యుల‌కు ఇది తేలిక‌గా అర్ధ‌మ‌వుతుంది. కానీ గ్రామీణ ప్రాంత‌ ప్ర‌జ‌లు, వృద్ధుల‌ు రెండింటి మ‌ధ్య తేడా గుర్తించ‌టం క‌ష్ట‌మే. ఎందుకంటే వైసీపీ వైపు ప‌ల్లె ప్ర‌జ‌లు అధిక‌శాతం మొగ్గుచూపుతున్నారు. రాబోయే ఎన్నిక‌ల్లో పార్టీను గ‌ట్టెక్కించేది గ్రామీణ ఓట‌ర్లు, అభిమానులే అనేంత భ‌రోసా వైసీపీలో క‌నిపిస్తుంది. అయితే ఇప్పుడు కొత్త‌గా వ‌చ్చిప‌డిన హెలికాప్ట‌ర్ గుర్తు త‌మ ఓట్ల‌ను ఎక్క‌డ చీల్చుతుంద‌నే బెంగ వైసీపీ నేతల్లో పట్టుకుంది. పైగా కేఎ పాల్‌.. ఏపీలోని 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేస్తానంటున్నాడు. ఓస్ ఇంతేగా అని తేలిక‌గా కొట్టిపారేద్దామంటే.. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో గులాబీపార్టీ చ‌విచూసిన అనుభ‌వం ఉండ‌నే ఉంది. టీఆర్ ఎస్ పార్టీ గుర్తు కారు. ఇదే ఎన్నిక‌ల్లో ట్ర‌క్కు గుర్తుతో మ‌రోపార్టీ రంగంలోకి దిగింది. ఫ‌లితంగా కారుకు ప‌డాల్సిన ఓట్ల‌ను చాలా వ‌ర‌కూ ట్ర‌క్కు లాగేసుకుంది. ఓడిన టీఆర్ ఎస్ అభ్య‌ర్థుల్లో అధిక‌శాతం ట్ర‌క్కు గుర్తు వ‌ల్ల‌నే ఓట‌మి చ‌విచూశారు. ఇప్పుడు ఇదే ఏపీలో హెలికాప్ట‌ర్‌, ఫ్యాన్ గుర్తుల మ‌ధ్య పున‌రావృత‌మైతే.. వైసీపీ పరిస్థితి మరోసారి ప్రతిపక్షానికే పరిమితమయ్యే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేఎ పాల్ గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకారు. పాల్ మొదట్నుంచి చంద్రబాబు అనుకూలురనే పేరు ఉంది. వైఎస్ పై విరుచుకుపడే పాల్ ఆయన హయాంలో తీవ్ర రాజకీయ ఇబ్బందులెదుర్కొవడంతో కక్ష సాధింపులో భాగంగా తమ మతపరమైన ఓట్లు వేయకూడదంటూ పలు సందర్భాల్లో పిలుపునిచ్చారు. నాటి నుంచి వైఎస్ఆర్ అన్నా జగన్ అన్నా… తీవ్రంగా వ్యతిరేకించే పాల్… వైసీపీ జెండాను పోలిన పార్టీ జెండాను ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పుడు లక్కు కొద్ది అదే పార్టీని పోలిన సింబల్ ను సైతం పొందగలిగారు. దీని వల్ల ఆయన సాధించేది పెద్దగా లేకపోయినా… వైసీపీ నష్టపోతుందనే చర్చ జరుగుతోంది. టీడీపీ నేతలు మాత్రం పాల్ పార్టీ సింబల్ దెబ్బకు జగన్ పార్టీ బలైపోతోందని సంబరపడిపోతున్నారు.