Latest News:
ద‌గ్గుబాటి హితేష్ కు నో టిక్కెట్‌! | లోకేష్.. సాక్షి టీవీకి మామూలు పంచ్ ఇవ్వ‌లేదు ! | యువ నేత‌ల పోటీ ఎక్క‌డి నుంచో... | జగన్‌ను నాగార్జున కలవడం వెనుక రహస్యం బయటపడింది | మహానాయ‌కుడు సినిమా చూస్తే..నేనేంటో తెలుస్తుంది | జీవీఎల్‌...నా గురించి తెలియ‌లాంటే మోడీని అడుగు

నాగార్జున రెక‌మెండేష‌న్ ఫ‌లించిందా?

March 03, 2019
అటు అసెంబ్లీ, ఇటు సార్వ‌త్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్దీ... ఏపీలో రాజ‌కీయం రంజుగా సాగుతోంది. ఇటు వైపు నుంచి అటు... అటు వైపు నుంచి ఇటు నేత‌లు జంప్ చేస్తున్నారు. కొంద‌రైతే... తాము వీడిన పార్టీలోకే మ‌ళ్లీ వ‌చ్చి చేరుతున్నారు. ఈ త‌ర‌హా జాబితాలో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌, ప్ర‌స్తుతం టీడీపీ న‌ర‌సాపురం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జీ క‌నుమూరి ర‌ఘురామ కృష్ణంరాజు చేరిపోయారు. గ‌డ‌చిన ఎన్నిక‌ల దాకా వైసీపీలోనే కొన‌సాగిన రాజు... స‌రిగ్గా ఎన్నిక‌ల‌కు ముందు వైసీపీకి ఝ‌ల‌క్ ఇచ్చారు. టీడీపీలో చేరిపోయారు. ఆ త‌ర్వాత టీడీపీలోనే కొన‌సాగుతూ వ‌చ్చిన రాజు... న‌ర‌సాపురం పార్ల‌మెంటు నియోజక‌వ‌ర్గ ఇంచార్జీగా కొన‌సాగుతున్నారు. 
 
గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌లేకపోయిన రాజు... ఈ ద‌ఫా ఎలాగైనా బ‌రిలోకి దిగాల్సిందేన‌ని తీర్మానించుకున్నారు. ఈ నేప‌థ్యంలో టీడీపీ నుంచి త‌న‌కే న‌ర‌సాపురం టికెట్ ద‌క్కుతుందా?  లేదా? అంటూ చాలా కాలం నుంచి మీన‌మేషాలు లెక్కిస్తూ వ‌చ్చిన రాజు... ఇప్పుడు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న‌ట్లుగా ప్ర‌చారం సాగుతోంది. ఏ పార్టీ తీరు న‌చ్చ‌లేద‌ని చెప్పి... టీడీపీలో చేరారో... ఇప్పుడు అదే పార్టీలోకి వ‌చ్చి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న‌ట్లుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన సంద‌ర్భంగా రాజు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తీరు న‌చ్చ‌ని కార‌ణంగానే తాను ఆ పార్టీని వీడుతున్న‌ట్లుగా ఆయ‌న ప్ర‌క‌టించారు. అయితే ఇప్పుడు తాను వ‌దిలి వెళ్లిన పార్టీ వైసీపీలోకి వ‌చ్చి చేరేందుకు స‌యామ‌త్త‌మ‌వుతున్న‌ట్లుగా వార్త‌లు వ‌స్తున్నాయి. 
 
ప్ర‌ముఖ పారిశ్రామిక‌వేత్త‌గా మంచి పేరున్న రాజు... ఆ రంగంలోకి చాలా మందితో మంచి స్నేహ సంబంధాల‌ను కొన‌సాగిస్తున్నారు. ఈ క్ర‌మంలో టీడీపీలో త‌న‌కు టికెట్ ద‌క్క‌క‌పోతే... పార్టీ మారేందుకు కూడా వెనుకాడేది లేద‌ని ఆయ‌న త‌న స‌న్నిహితుల వ‌ద్ద చెబుతూ వ‌స్తున్నార‌ట‌. ఈ విష‌యం తెలిసిన మీద‌టే... న‌ర‌సాపురం పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గ స‌మీక్ష‌కు రాజుకు ఆహ్వానం అంద‌లేద‌ట. దీంతో త‌న‌కు టికెట్ ద‌క్క‌ద‌న్న భావ‌నకు వ‌చ్చిన రాజు... అప్ప‌టిక‌ప్పుడు రంగంలోకి దిగి వైసీపీ నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపార‌ట. త‌న‌కు మంచి స్నేహితుడిగా ఉన్న సినీ హీరో నాగార్జున‌ను రంగంలోకి దించిన రాజు... ఆయ‌న‌ను నేరుగా జ‌గ‌న్ వ‌ద్ద‌కు పంపార‌ట‌. మొన్నామధ్య జ‌గ‌న్‌తో నాగ్ భేటీ అయిన కార‌ణం కూడా ఇదేన‌న్న ఊహాగానాలు సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో  రాజు నుంచి వ‌చ్చిన ప్ర‌తిపాద‌న‌పై పార్టీ ముఖ్యుల‌తో చ‌ర్చించిన జ‌గ‌న్‌... ఆయ‌న‌ను పార్టీలో చేర్చుకునేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని... రేపో, ఎల్లుండో రాజు వైసీపీలో చేరిపోవ‌డం ఖాయ‌మ‌న్న కోణంలో విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.