Latest News:
ద‌గ్గుబాటి హితేష్ కు నో టిక్కెట్‌! | లోకేష్.. సాక్షి టీవీకి మామూలు పంచ్ ఇవ్వ‌లేదు ! | యువ నేత‌ల పోటీ ఎక్క‌డి నుంచో... | జగన్‌ను నాగార్జున కలవడం వెనుక రహస్యం బయటపడింది | మహానాయ‌కుడు సినిమా చూస్తే..నేనేంటో తెలుస్తుంది | జీవీఎల్‌...నా గురించి తెలియ‌లాంటే మోడీని అడుగు

జీవీఎల్‌...నా గురించి తెలియ‌లాంటే మోడీని అడుగు

March 03, 2019
జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు, బీజేపీ నేత‌ల‌కు మ‌ధ్య మాట‌ల యుద్ధం ముదురుతోంది. పవన్ కళ్యాణ్ పై జీవీఎల్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగ‌తి తెలిసిందే. పాకిస్థాన్ మెడలు వంచి అభినందన్‌ని భారత్ కి అప్పగించేలా మోడీ చేశారని జీవీఎల్ పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు మోడీ ని గౌరవిస్తే.. మన దేశ రాజకీయ నేతలు అగౌరవ పరిచారని ఆగ్రహం వ్యక్తం చేసారు. పీకే అంటే పాకిస్తాన్  మనిషి అని పాకిస్తాన్ భావిస్తుందని..పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల వెనుక చంద్రబాబు ఉన్నారని జీవీఎల్ ఆరోపించారు. అధికారానికి దారేది లా.. ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో అనే  డైలాగ్ ని పవన్ నిజం చేస్తున్నాడని వ్యాఖ్యానించారు.
 
బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు కామెంట్ల‌పై చిత్తూరులో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్పందించారు. తన దేశ భక్తి గురించి తెలుసుకోవాలంటే ప్రధాని మోడీని అడగాలని వ్యాఖ్యానించారు. జీవీఎల్‌ నోరు అదుపులో ఉంచుకుని మాట్లాడాలని సూచించిన పవన్‌.. 'మీరు యుద్ధానికి సిద్ధమంటే నేను రెండుసార్లు సై అంటాను' అని చెప్పారు. రాయలసీమలో తనకు బలం లేదని కొంతమంది నేతలు వ్యాఖ్యానించడాన్ని ప్రస్తావిస్తూ.. తన బలం ఎంటో చూపిస్తానన్నారు. తాను పార్టీ పెట్టేటప్పుడు ఎంతో మంది భయపెట్టారని.. కాని జన బలమే తన బలం అని నమ్మి వచ్చానని అన్నారు. ఒక్క బీజేపీకే దేశ భక్తి ఉంటుందా..? మిగతా పార్టీలకు ఉండదా? అని ప్రశ్నించారు. 
 
ఇక త‌న రాయ‌ల‌సీమ టూర్ సంద‌ర్భంగా ఆ ప్రాంతంలోని అంశాల‌ను ప‌వ‌న్ ప్ర‌స్తావించారు. చంద్రబాబు రాయలసీమకే కాదు.. కుప్పంను కూడా అభివృద్ధి చేయలేదని పవన్‌ విమర్శించారు. జనసేన అధికారంలోకి వస్తే ఏ ముఖ్యమంత్రీ అభివృద్ధి చేయని విధంగా రాయలసీమను అభివృద్ధి చేస్తానని.. ఈ విషయాన్ని ఏడు కొండల స్వామి సాక్షిగా చెబుతున్నానని అన్నారు.