Latest News:
ద‌గ్గుబాటి హితేష్ కు నో టిక్కెట్‌! | లోకేష్.. సాక్షి టీవీకి మామూలు పంచ్ ఇవ్వ‌లేదు ! | యువ నేత‌ల పోటీ ఎక్క‌డి నుంచో... | జగన్‌ను నాగార్జున కలవడం వెనుక రహస్యం బయటపడింది | మహానాయ‌కుడు సినిమా చూస్తే..నేనేంటో తెలుస్తుంది | జీవీఎల్‌...నా గురించి తెలియ‌లాంటే మోడీని అడుగు

‘యాత్ర’ మూవీ రివ్యూ

February 08, 2019

సమర్పణ: శివ మేక
నిర్మాణ సంస్థ‌: 70 ఎం ఎం ఎంటర్టైన్మెంట్స్
నటీనటులు: మమ్ముట్టి, రావు ర‌మేష్, జగపతిబాబు, సుహాసిని, అనసూయ, పోసాని, సచిన్ కడ్కర్, వినోద్ కుమార్, జీవా, పృథ్వీ త‌దితరులు
సినిమాటోగ్రఫీ: సత్యన్ సూర్యన్
మ్యూజిక్: కె@ క్రిష్ణ కుమార్
ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్
లిరిసిస్ట్: సిరివెన్నెల సీతారామ శాస్త్రి
నిర్మాతలు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి
స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ : మహి వి రాఘవ్

 

దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన్న చిత్రం ‘‘యాత్ర’’. 70 ఎంఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై విజ‌య్ చిల్లా, శశిదేవి రెడ్డి నిర్మాణంలో వస్తున్న ఈ చిత్రానికి మ‌హి వి రాఘ‌వ్ దర్శకత్వం వహించారు. మళయాల సూపర్ స్టార్ మమ్ముట్టి ఇందులో వైఎస్సార్ పాత్రను పోషించారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా..? వైఎస్సార్ అభిమానుల అంచనాలను ‘యాత్ర’ అందుకుందా..?

కథ
రాయలసీమలోనే కీలక నేతగా ఉంటూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ప్రతిపక్షగా నేతగా ఉంటారు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి(మమ్ముట్టి). ఎన్నిక‌లకు సమయం దగ్గరపడుతుండడంతో ప్రతిపక్ష నేతగా ఉంటూ పార్టీని గెలిపించే బాధ్యతను తీసుకుంటారు. ఈ క్రమంలోనే తన నియోజర్గంతో పాటు ముఖ్య నేతలతో సంప్రదింపులు జరుపుతారు. అతడికి అత్యంత ఆప్తుడైన కేవీపీ రామచంద్రరావు(రావు రమేష్) సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్తుంటారు. వైఎస్ మొండితనం ఉన్న నేత కావడంతో హైకమాండ్‌కు ఎదురు తిరుగుతారు. అదే సమయంలో తన నియోజకవర్గంలోని ప్రజల కష్టాలను దగ్గరుండి చూసిన వైఎస్.. రాష్ట్రం మొత్తం తిరగాలని భావిస్తారు. ఇందులో భాగంగానే హైకమాండ్‌కు కూడా తెలియకుండా పాదయాత్ర చేయాలని డిసైడ్ అయిపోతారు. ఆయన అనుకున్నట్లుగా మొదట పాదయాత్రకు పెద్దగా స్పందన ఉండదు. మరి, ఇది ఎలా పెరిగింది..? వైఎస్‌ను ప్రజలు ఎందుకు అక్కున చేర్చుకున్నారు..? ఆయన సీఎం అవ్వడానికి పాదయాత్ర ఎలా ఉపయోగపడింది..? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే
ఈ సినిమా బయోపిక్ అని చెప్పుకున్నా.. కేవలం రాజశేఖర్‌రెడ్డి పాదయాత్ర ఎపిసోడ్‌ను మాత్రమే చూపించారు. వాస్తవానికి వైఎస్సార్ జీవితంలో పాదయాత్ర ఎంతో కీలకమైనది. అందుకే దర్శకుడు ఈ పాయింట్‌ను తీసుకుని ఉంటాడు. ముందుగా అతడు చేసిన సాహసానికే మెచ్చుకోవాలి. తీసుకున్నది తెలిసిన పాయింటే అయినా దానికి భావోద్వేగం జోడించి తెరకెక్కించాడు. దీంతో సినిమా ఆకట్టుకుంటుంది. అలాగే మమ్ముట్టి ఈ సినిమాకు ప్రాణం పోశారు. తన నటనతో చిత్రాన్ని మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. మొత్తం మీద వైఎస్ అభిమానులకు పండుగ లాంటి సినిమా అని చెప్పవచ్చు. వైఎస్ బయోపిక్‌లా కాకుండా ఓ సినిమాలా చూస్తే మిగతా వారికీ నచ్చుతుంది. అయితే, వాళ్లను మాత్రం థియేటర్లకు రప్పించుకుంటుందా అంటే చెప్పడం కష్టమే.

నటీనటుల పనితీరు
ముందుగా ఈ సినిమా చేయడానికి మమ్ముట్టి ఒప్పుకోవడమే అభినందించదగ్గ విషయం. ఈ సినిమాలో ఆయన ప్రాణం పెట్టి నటించారు. ముఖ్యంగా వైఎస్సార్ పాత్రలోని సోల్‌ని, ఎమోషన్‌ను బాగా వంటబట్టించుకున్నారు. తన నటనలో తన ఎక్స్ ప్రెషన్స్‌లో మమ్ముట్టి చూపించిన విధానం సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. స్ర్కీన్ మొత్తం ఆయనే కనిపిస్తూ ఉంటారు. అలాగే కేవీపీ పాత్రలో నటించిన రావు రమేష్, రాజా రెడ్డిగా కనిపించిన జగపతి బాబు, సబితా ఇంద్రారెడ్డిగా నటించిన సుహాసిని తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మరో ముఖ్య పాత్రలో కనిపించిన పోసాని కూడా తన నటనతో ఆకట్టుకుంటాడు. అలాగే ఇతర పాత్రల్లో కనటించిన నటీనటులు కూడా తమ నటనతో మెప్పిస్తారు.

టెక్నీషియన్ల పనితీరు
మహీ వీ రాఘవ్ రచయితగా, దర్శకుడిగా ఈ చిత్రానికి పూర్తి న్యాయం చేశారు. అసలు మమ్ముట్టిని ఈ చిత్రం చేయడానికి ఒప్పించడంలోనే మొదటి సక్సెస్ సాధించాడు. తెలిసిన పాయింటే తీసుకున్నా.. దానిని తెరకెక్కించడంలో దర్శకుడు విజయవంతం అయ్యాడు. వీటికి బలమైన ఎమోషనల్ సన్నివేశాలు జోడించి చిత్రాన్ని ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు. సంగీత దర్శకుడు ‘కె’ సమకూర్చిన పాటలు, వాటి పిక్చరైజేషన్ కూడా బాగున్నాయి. ముఖ్యంగా రైతు పాట చిత్రంలో చెప్పుకోదగ్గ పాటగా నిలిచిపోతుంది. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫీ వర్క్ చాలా బాగుంది. సినిమాలోని సన్నివేశాలన్నీ ఆయన కథకి అనుగుణంగా చాలా అందంగా చిత్రీకరించారు. ఎడిటింగ్ కూడా బాగుంది. నిర్మాతలు విజ‌య్ చిల్లా, శశిదేవి రెడ్డి ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. వాళ్ళ నిర్మాణ విలువులు చాలా బాగున్నాయి.

బలాలు
* దర్శకుడు ఎంచుకున్న పాయింట్
* మమ్ముట్టి నటన
* ఎమోషనల్ సీన్స్

బలహీనతలు
* డాక్యుమెంటరీ తరహాలో సాగడం
* ద్వితీయార్ధం
* ఆసక్తిని రేకెత్తించని సన్నివేశాలు

మొత్తంగా: భావోద్వేగంతో కూడుకున్న ‘యాత్ర’

రేటింగ్: 2.75/5

RELATED ARTICLES

  • No related artciles found